Ministers Comments On Congress Meeting : 'కాంగ్రెస్ జన గర్జన సభ.. ఒక ఫ్లాప్ షో' - కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన ప్రశాంత్‌రెడ్డి
Telangana Ministers Counter on Rahul Gandhi Comments : తెలంగాణలో అమలవుతున్న పథకాలను దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేశాక రాహుల్‌గాంధీ మాట్లాడాలని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ సవాల్ విసిరారు. స్కామ్‌లకు మారుపేరైన కాంగ్రెస్ నేతలు.. అవినీతి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మండిపడ్డారు. తెలంగాణలో రూ.4000 పింఛన్ ఇస్తామంటున్న కాంగ్రెస్.. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఈ హామీ ఇవ్వగలదా అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ ఎవరికీ బీ టీమ్ కాదన్న మంత్రులు.. తెలంగాణకు కేసీఆరే శ్రీ రామరక్ష అని పేర్కొన్నారు. ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకంగా 9 స్థానాలను కైవసం చేసుకుంటామని మంత్రి అజయ్ ధీమా వ్యక్తం చేశారు. తమ దగ్గర పనికి రాని స్క్రాఫ్‌ను కాంగ్రెస్‌నేతలు పట్టుకొని వెళుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ పార్టీలో అందరూ ధనవంతులైతే.. ఇప్పుడు మీ పక్కకు చేరిన పొంగులేటి ధనవంతుడు కాడా అని ప్రశ్నించారు. సీఎల్పీ నేత భట్టి పాదయాత్రకు ఎలాంటి స్పందన లేదని.. కాంగ్రెస్ జన గర్జన సభ ఒక ఫ్లాప్ అయిన సభ అని మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శించారు.