తేజస్ యుద్ధ విమానంలో మోదీ రైడ్- వీడియో చూశారా? - తేజస్‌లో ప్రయాణించిన ప్రధాని మోదీ
By PTI
Published : Nov 25, 2023, 4:13 PM IST
PM Modi Flies In Tejas : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తేజస్ యుద్ధ విమానంలో విహరించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానంలో ఉత్సాహంగా ప్రధాని మోదీ ప్రయాణించారు. ఈ అనుభవం స్వదేశీ ఉత్పత్తులపై.. తనకున్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిందని ఆయన తెలిపారు. శనివారం ఉదయం బెంగళూరు హెచ్‌ఏఎల్ కంపెనీని సందర్శించిన ప్రధాని.. తేజస్ ఫైటర్ జెట్ల తయారీ గురించి తెలుసుకున్నారు. యుద్ధ విమానాల ఉత్పత్తి కేంద్రాన్ని కూడా మోదీ పరిశీలించారు. IAF పైలెట్ల దుస్తులు ధరించిన మోదీ తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. మన దేశ సామర్థ్యం... నూతన ఆశావాదాన్ని, గర్వాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. స్వయం సమృద్ధిలో మనం ప్రపంచంలో ఏ దేశానికి తక్కువ కాదన్న ప్రధాని.. వైమానిక దళం, DRDO, HALకు హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.
తేజస్ అనేది దేశీయంగా తయారైన సింగిల్ ఇంజిన్ యుద్ధ విమానం. ఆర్మీ, వాయుసేన కోసం దీనిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తేజస్‌ను తయారు చేసింది.