ముసలోడే కానీ మహానుభావుడు: మల్లయుద్ధంలో ఫస్ట్ ప్రైజ్ - telangana latest news
Old man win in wrestling matches in Nizamabad: సాధారణంగా వృద్ధులు శివరాత్రి వచ్చిందంటే శివ నామస్మరణ చేస్తారు. బాగా దైవభక్తి ఉన్నవారు ఉపవాస దీక్ష పాటించి జాగారం చేస్తుంటారు. కానీ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ తాత మాత్రం శివరాత్రికి తన ప్రతిభతో ఔరా అనిపించాడు. కుస్తీపోటీల్లో పాల్గొని యువకులకు సవాల్ విసిరాడు.
నేటి కాలంలో శారీరకంగా ధృఢంగా ఉండటం అంత ఈజీ కాదు. ప్రస్తుత జీవన శైలిలో యుక్త వయస్సులో ఉన్నవారు సైతం తొందరగా అలసిపోతున్నారు. దీనికి కారణం మనం తినే ఆహారం. అంతా రసాయనాలతోనే పండించడం, శారీరక శ్రమలేని ఉద్యోగాలు వీటి వల్ల శారీరక ఆరోగ్యం నిసత్తువగా మారిపోతోంది. కానీ ఆరు పదుల వయసు ఉన్న ఓ వృద్ధుడు కుస్తీపోటీల్లో సత్తాచాటారు. నవ యువకుడిలా హోరాహోరిగా తలపడ్డాడు. ఈ రోజుల్లో కబడ్డీ ఆట ఆడాలన్నా.. ఎక్కడ దెబ్బలు తగులుతాయోనని యువకులు కూడా భయపడుతుంటే.. ఇతను మాత్రం ఏకంగా కుస్తీ పోటీల్లోనే పాల్గొని ప్రత్యర్థిని మట్టి కరిపించాడు.
మహా శివరాత్రి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం తానాకలాన్లో ఆదివారం మల్లయుద్ధ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇద్దరు వృద్ధుల మధ్య కొనసాగిన పోటీ ఉత్కంఠ భరితంగా సాగింది. గ్రామానికి చెందిన అబ్బయ్య (60), మంగళ్ పహాడ్ గ్రామానికి చెందిన హన్మాండ్లు(50) తలపడ్డారు. చివరికి అబ్బయ్య గెలుపొందారు. సర్పంచి భాస్కర్ రెడ్డి విజేతకు నగదు బహుమతి అందజేశారు.
ఇవీ చదవండి: