తెలంగాణ

telangana

MLC Jeevan Reddy Latest Comments on Kavitha

ETV Bharat / videos

MLC Jeevan Reddy Latest Comments on Kavitha : ఐదేళ్లు ఎంపీ పదవిలో ఉండి చక్కెర ఫ్యాక్టరీలు మూసివేయించిన ఘనత కవితదే: జీవన్‌రెడ్డి - రాహుల్‌గాంధీ జగిత్యాల పర్యటన

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2023, 3:26 PM IST

MLC Jeevan Reddy Latest Comments on Kavitha : జగిత్యాలలో ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కవితపై వివాదాస్పద వ్యాఖలు చేశారు. ఎంపీగా ఐదేళ్లు పదవిలో ఉండి.. చక్కర ఫ్యాక్టరీ మూసి వేయించిన ఘనత కవితకు దక్కుతుందన్నారు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకుడని.. దేశవ్యాప్తంగా  అన్ని మతాలను ఏకం చేయడం కోసం భారత్ జోడో యాత్ర చేపట్టిన మహానేత అన్నారు. రాహుల్ గాంధీని విమర్శించే హక్కు ఎమ్మెల్సీ కవితకు లేదని... వాళ్లు మరోసారి అధికారంలోకి వస్తే... బతుకమ్మ పండగను భ్రష్టు పట్టిస్తారని జీవన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. 

జగిత్యాల జిల్లాలో రాహుల్‌గాంధీ పర్యటన గురించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజానీకంతో రాహుల్‌గాంధీ రోడ్‌ షో ఉంటుందని తెలిపారు. రైతులకు మద్ధతు ధరతో పాటు... రూ.500 బోనస్ రూపంలో ఇస్తామని ప్రకటించిన తెలిపిన నాయకులు రాహుల్‌గాంధీ అన్నారు. ప్రజలకు కవిత ఏం చేశారని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో నడి ప్రాంతంలో ఉన్న కలెక్టరేట్‌ను తీసుకెళ్లి  ఊరి చివరన కట్టారు.. దాని వల్ల ఎవరికి ఏం ఉపయోగముందని మండిపడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details