హాస్టల్ ఫుడ్‌లో పురుగులు, ఆందోళనకు దిగిన జేఎన్టీయూ విద్యార్థులు - protest at kukatpally
Published : Jan 4, 2024, 10:10 PM IST
JNTUH PG Students Protest at Kukatpally : కూకట్‌పల్లి జేఎన్టీయూహెచ్‌లో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో తినే ఆహారంలో తరచుగా పురుగులు వస్తున్నాయని విశ్వవిద్యాలయం మెయిన్ గేట్ వద్ద ధర్నాకు దిగారు. మంచి ఆహారం కోసం తామంతా విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్‌లో నలుగురు విద్యార్థులు కలిసి మాట్లాడుకున్నా సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.
JNTU Students Protest : యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తనను చూస్తుంటే 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఉన్నారేమోనని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యలపై యూనివర్సిటీ సంబంధిత ప్రొఫెసర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమకు పురుగులు లేని నాణ్యమైన ఆహారం కావాలని, క్యాంపస్‌లో అమలవుతున్న అనధికార 144 సెక్షన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ విద్యార్థులను కలిసి సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చినా, ఆందోళన విరమించలేదు. తమ సమస్యలను తక్షణమే పరిష్కారించాలని డిమాండ్ చేశారు.