Crocodile in Manjeera Pumphouse in Sangareddy : మంజీరా పంప్‌హౌస్‌లో మొసలి కలకలం.. భయాందోళనలో జనం - సంగారెడ్డి తాజా వార్తలు
Published : Oct 10, 2023, 11:23 AM IST
Crocodile in Manjeera Pumphouse in Sangareddy :సంగారెడ్డి జిల్లా కల్పగురు మండల శివారులోని మంజీరా పంప్ హౌస్‌లో సోమవారం మొసలి కలకలం రేపింది. స్థానిక ఉద్యోగులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న రక్షణ సిబ్బంది మొసలిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. మొదట మోటార్ల సాయంతో నీటిని బయటకు తీసి, తర్వాత మొసలిని తీస్తే ప్రమాదం ఉండదని వారు అనుకున్నారు.
Crocodile Spotted in Sangareddy Manjeera Pumphouse : అకస్మాత్తుగా మంజీర నీటి సంపులో ప్రత్యక్షమైన మొసలిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారని అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా మొసళ్లు తక్కువ నీరు ఉన్న చోట జీవించడం అరుదైన విషయం. చిన్న చిన్న వాగులు, ఊరి చెరువుల్లో ఇవి కనిపించడం అసహజం. అలాంటిది.. భారీ మొసలి ఏకంగా నీటి సంపులో కనిపించడంతో ఆ ప్రాంత వాసులు అవాక్కయ్యారు. ఒక్కసారిగా జడుసుకుని స్థానిక సహాయక సిబ్బందికి సమాచారం అందించారు.