తెలంగాణ

telangana

Ayodhya Ram Mandir Rangoli

ETV Bharat / videos

7రోజులు, 1000 కిలోల రంగులు- అయోధ్య రామమందిర రంగోలి సూపర్​!

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 1:31 PM IST

Ayodhya Ram Mandir Rangoli: దీపావళి పండుగ సందర్భంగా అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య రామ మందిరం థీమ్​తో గుజరాత్​లో అతిపెద్ద రంగోలి రూపొందింది. సూరత్​లో సుమారు 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అగర్వాల్ వికాస ట్రస్ట్​ యూత్​ సభ్యులు ఈ రంగోలిని ఎంతో అద్భుతంగా వేశారు.

సూరత్​ నగరంలో రామమందిరం థీమ్​పై మొత్తం 52 రంగోలీలను అగ్వరాల్ వికాస్​ ట్రస్ట్ సభ్యులు రూపొందించారు. వాటిల్లో సిటీ లైట్ ఏరియాలో వేసిన రంగోలినే అతిపెద్దది. 50 అడుగుల పొడవు, 70 అడుగుల వెడల్పుతో సుమారు 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో రామ మందిర రంగోలిని వేశారు. మొత్తం 7 రోజుల్లో 26 మంది సభ్యులు కలిసి ఈ రంగోలిని పూర్తి చేశారు. అందుకోసం 1000 కిలోల 18 రకాల రంగులను ఉపయోగించారు. ఈ రంగోలిలో రామమందిర నమూనాతో పాటు సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడి ప్రతిరూపాలు కూడా రూపొందించారు. భారీ రంగోలిని ప్రజలు దీపావళి వరకు చూసి తిలకించవచ్చని అగర్వాల్ ట్రస్ట్ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details