చిత్ర కళాప్రియులను ఆకర్షిస్తోన్న ఆర్ట్ ఎగ్జిబిషన్ - హైదరాబాద్
రాష్ట్రంలోని పలువురు చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన పలు వర్ణ, కళాఖండాల చిత్రాలు కళాప్రియులను ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని అవర్ ప్లేస్‌లో బిందు, ది బిగినింగ్ పేరిట అన్నపూర్ణ, జ్యోతిదాస్ అనే ఇద్దరు మహిళలు చిత్రకళ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో 40 మంది ప్రముఖ చిత్రకారులకు చెందిన 90 చిత్రాలు కొలువుదీరాయి.