కళకళలాడే వీధులు ఇలా బోసిపోయాయి ఎందుకు?
ఇటలీలో కరోనా తీవ్ర స్థాయిలో విస్తరిస్తోంది. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అక్కడ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. కరోనా భయాందోళనల నడుమ ప్రజలు బయటకు రావడం లేదు. వినియోగదారులు లేకపోవడం వల్ల వాణిజ్య కేంద్రాలు, రెస్టారెంట్లు, బార్లు, పబ్లు వెలవెలబోతున్నాయి. చేసేదిలేక సంస్థ యజమానులు వాటిని మూసివేస్తున్నారు. కొవిడ్-19 మనుషులపైనే కాకుండా వాణిజ్యంపైన కూడా ప్రభావం చూపి ఆ దేశాన్ని ఆర్థికంగానూ చిదిమేస్తోంది.