ఐస్ హాకీలో అదరగొట్టిన రష్యా అధ్యక్షుడు - అధ్యక్షుడు
మంచుపై హాకీ అంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎంతో ఇష్టం. ప్రతి ఏటా నిర్వహించే ఐస్ హాకీ ప్రదర్శనలో పాల్గొంటారు కూడా. తాజాగా సోచిలోని బోల్షాయ్ ఐస్ డోమ్ మైదానంలో నైట్ ఐస్ హాకీ లీగ్ నిర్వహించారు. దేశంలోని ఐస్ హాకీ మాజీ దిగ్గజాలు స్లేవ్ ఫెస్టిసోవ్, పావెల్ బ్యూర్లతో కలిసి 'లెజెండ్' జట్టు తరఫున బరిలోకి దిగారు పుతిన్. అధ్యక్షుడి అద్భుత ప్రదర్శనతో ఆయన జట్టు 14-7 తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించింది. ఇందులో పుతిన్ 8 గోల్స్ చేయటం విశేషం.
Last Updated : May 11, 2019, 9:13 AM IST