తెలంగాణ

telangana

Randeep Hooda Wedding Ceremony

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 10:24 PM IST

Updated : Nov 30, 2023, 6:08 AM IST

ETV Bharat / videos

ప్రేయసిని పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హీరో - మణిపురి సంప్రదాయంలో ఒక్కటైన జంట

Randeep Hooda Wedding Ceremony :బాలీవుడ్ స్టార్ హీరో రణ్​దీప్ హుడా తన ప్రేయసి లిన్‌ లైస్రామ్​తో పెళ్లి పీటలెక్కారు. మణిపుర్​ ఇంఫాల్‌లోని ఓ దేవాలయంలో వీరి వివాహ వేడుక సింపుల్​గా జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో మణిపురి స్టైల్​లో ఈ జంట ఒకటయ్యారు. అయితే వీరి పెళ్లి వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. సంప్రదాయాలను పాటిస్తూ.. ఈ జంట పెళ్లి జరగడం వీక్షకులను ఆకట్టుకుంటోంది.

పెళ్లి కోసం వధూవరులు సాంప్రదాయ మణిపురి వివాహ దుస్తుల్లో కనిపించారు. రణదీప్ పూర్తిగా తెల్లటి కుర్తా ధోతీ ధరించి కనిపించగా వధువు లిన్ మాత్రం పొట్లోయ్ అనే  బలమైన వెదురుతో తయారు చేసిన ఓ డ్రెస్​ను ధరిచింది. అంతే కాకుండా బంగారు ఆభరణాలు ధరించి స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. చూడముచ్చటగా ఉన్న ఈ జంట.. బంధువుల సమక్షంలో వధువు ఇంటి సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు.  

Randeep Hooda Marriage Invitation :ఇక రణ్‌దీప్‌- లిన్​ ఎప్పటి నుంచో రిలేషన్‌షిప్​లో ఉన్నారు. అయితే ఇటీవలే తమ రిలేషన్​ గురించి రణ్‌దీప్‌ తొలిసారి ఫ్యాన్స్​కు చెప్పారు. తమ పెళ్లి ఇన్విటేషన్​ను సోషల్ మీడియాలో పంచుకుని ఈ గుడ్​ న్యూస్​ను ఆయన వెల్లడించారు. "మహాభారతంలో అర్జునుడు ఎక్కడ అయితే మణిపుర్‌ యువరాణి చిత్రాంగదను వివాహం చేసుకున్నారో అక్కడే సన్నిహితులు, కుటుంబ సభ్యుల  సమక్షంలో మేం ఒక్కటి కాబోతున్నాం" అంటూ రణ్​దీప్​ చెప్పారు.

Last Updated : Nov 30, 2023, 6:08 AM IST

ABOUT THE AUTHOR

...view details