Viral Video: ట్రాక్టర్ తోలుతూ పెళ్లి మండపానికి వధువు - మహారాష్ట్ర వార్తలు
పెళ్లి వేడుకకు ఎడ్లబండి మీద రావడం వంటి వీడియోలను మనం ఇంత వరకు చూశాం. కానీ వధువు ట్రాక్టర్ మీద రావడం ఎప్పుడైనా చూశారా! ఇదిగో.. మహారాష్ట్ర, పుణె జిల్లా దౌండ్ తాలూకాలో వధువు పూజా రాజరామ్ గైక్వాడ్.. ట్రాక్టర్ను తోలుతూ పెళ్లి మండపానికి వెళ్లింది. ట్రాక్టర్ను గ్రాండ్గా అలంకరించి.. చూపరులను ఆకట్టుకుంటూ రెండున్నర కిలోమీటర్లు డ్రైవ్ చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.