తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మనం తరచూ ముక్కును ఎందుకు తాకుతాం? - nose touching survey

చేతులతో ముక్కును తాకితే కరోనా సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలా ఎందుకు చేస్తామని ఇజ్రాయెల్​లో ఇటీవలే ఆన్​లైన్​ సర్వే నిర్వహించారు. అయితే 94 శాతం మంది ఒకే కారణం చెప్పారు.

why-we-touch-our-nose-frequently
మనం తరచూ ముక్కును ఎందుకు తాకుతాం?

By

Published : Apr 22, 2020, 9:10 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

చేతులతో కళ్లు, ముక్కు, నోటిని తాకొద్దు.. ఒకవేళ అలా చేస్తే మీకు కరోనా వైరస్‌ సోకొచ్చు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే తరచూ చేతుల వాసన చూడటం ముక్కు ప్రధాన విధుల్లో ఒకటంటూ రాయల్‌ సొసైటీ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం తెలిపింది. అసంకల్పితంగానే చేతులు ముక్కు వద్దకు వాటంతటవే వెళతాయంది.

ఎందుకు ఇలా?

మనుషులకు సోకుతున్న శ్వాస సంబంధ వ్యాధుల్లో 25% ముఖాన్ని తాకడం వల్లే వస్తున్నాయి. ఇంత ప్రమాదమున్నా మనుషులు ముఖాన్ని తాకుతూనే ఉన్నారని పరిశోధకులు గుర్తుచేస్తున్నారు. బహుశా తమ నుంచి ఎలాంటి వాసన వస్తోంది? తమ ఘ్రాణనాడులు ఎలా పని చేస్తున్నాయి? అని తెలుసుకోవడానికే ఈ అలవాటు కొనసాగుతూ ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఇదే విషయమై ఇజ్రాయెల్‌కు చెందిన వీజ్‌మన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ విభాగం వారు ఆన్‌లైన్‌లో ఇటీవల చేసిన సర్వేలో 19 దేశాలకు చెందిన 399 మంది పాల్గొన్నారు. వారి వయస్సు 19 నుంచి 74 ఏళ్ల మధ్య ఉంది. మనుషుల వాసన ప్రవర్తనను అంచనా వేసేందుకు... 1.చేతులను ఎప్పుడూ వాసన చూడలేదు... 2.చాలా అరుదుగా చూస్తాం... 3.అప్పుడప్పుడూ చూస్తాం... 4.తరచూ చూస్తుంటాం... అనే నాలుగు ప్రశ్నలను వారికి సంధించింది.

  • వారిలో తమను తాము వాసన చూసుకున్నామని 94% మంది తెలిపారు. తమ చేతులు, చంకల్లోనూ వాసన చూశామన్నారు. అలాగే కొత్త వారి వాసన పసిగట్టామంటూ 60% మంది తెలిపారు.
  • పిల్లల వ్యక్తిగత శుభ్రతను తెలుసుకోవడానికి వారి నుంచి వచ్చే వాసనను ఒక ఆయుధంగా చేసుకుంటామని మహిళలు వెల్లడించారు.
  • 3-6 సంవత్సరాల మధ్య ఉన్న తమ పిల్లలు తరచూ చేతులను వాసన చూసుకుంటారని తల్లిదండ్రులు వెల్లడించారు. ఇవన్నీ తమకు తెలియకుండానే(అసంకల్పితంగా) చేసేస్తున్నామంటూ సర్వేలో పాల్గొన్నవారు వెల్లడించారని పరిశోధకులు చెప్పారు. అయితే... తక్కువ మందితోనే సర్వే చేశామని, వారు సమాధానాలు నిజాయతీగా చెప్పినట్లే భావించామన్నారు. ఇంకా ఎక్కువ మందిని భాగస్వామ్యం చేస్తే ఫలితాలు మారొచ్చని వివరించారు.

ఇదీ చూడండి: 60 రోజుల పాటు గ్రీన్​కార్డుల మంజూరు నిలిపేసిన అమెరికా

Last Updated : May 21, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details