తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

రోజంతా శక్తి కావాలా? అల్పాహారంగా ఇవి తినండి!

రాత్రంతా నిద్రపోయి.. ఉదయం లేచే సమయానికి పొట్టంతా ఖాళీగా ఉంటుంది. అందుకే రోజూ అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే పనికి శక్తినిచ్చేది అల్పాహారమే. కాబట్టి ఎలాంటి బ్రేక్​ఫాస్ట్​ తీసుకుంటే మంచిది? అల్పాహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

breakfast
అల్పాహారం

By

Published : Aug 25, 2021, 5:23 PM IST

రోజూ అల్పాహారం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయం మనం తీసుకున్న అల్పాహారం.. రోజంతా మనకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుంది. అలాగే బరువును అదుపులో ఉంచుతుంది. అయితే మనకు ఎక్కువగా మేలు చేసే అల్పాహారం ఏంటి? ఏయే అల్పాహారం తింటే మరింత ఆరోగ్యం ఉంటాం?

ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే పనికి శక్తినిచ్చేది అల్పాహారమే. అందుకే మనం రోజు తీసుకునే అల్పాహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా.. కొవ్వు తక్కువగా ఉండే పోషక విలువలున్న ఆహారాలను తీసుకోవడం మంచిది. ఇందుకోసం రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన రొట్టెలు, అటుకులు, ఓట్​మీల్​ వంటివి చక్కని ప్రత్యామ్నాయాలు.

అవి తింటే అదుపులో బరువు

పీచు తర్వాత మనం తప్పనిసరిగా తీసుకోవాల్సినవి మాంసపు కృత్తులు. గుడ్లను అల్పాహారంతో తీసుకోవడం వల్ల అవసరమైన ప్రోటీన్స్ అందుతాయి. మాంసపుకృత్తులతో పాటు అత్యవసర విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయి. వీటితో పాటు బాదం వంటి ఎండు పప్పులను కూడా చేర్చుకోవచ్చు. అలాగే తృణ ధాన్యాలతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఓట్​ మీల్​ తీసుకుంటే బరువు అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. పండ్లు, కూరగాయలను మూడు దఫాలగా తీసుకోవాలన్నది సూత్రం. కాబట్టి అల్పాహారంలో కూడా ఇవి ఉండేలా చూసుకోవాలి.

అల్పాహారం మానేస్తే సమస్యలు

అల్పాహారం సరిగా తీసుకోకపోవడం వల్ల పిల్లల్లో ప్రోటీన్​ లోపం ఏర్పడి.. ఐక్యూ స్థాయి, సమతుల్యత, ఏకాగ్రత తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. పెద్దల్లో కూడా బీపీ వంటి అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చని అంటున్నారు.

బయట వద్దు

టిఫిన్​ అనగానే ఇంట్లో తినడం ఎందుకులే బయట తింటే పోలా? అని సరిపెట్టుకుంటారు. అయితే ఇది మంచి పద్దతి కాదని.. బయట తినే ఆహారంలో ఉప్పు, నూనెల మోతాదు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకని ఇంట్లోనే తినడం మంచిదంటున్నారు.

ఇదీ చూడండి:శారీరక, మానసిక ఒత్తిడి.. దీని ఉపయోగంతో పరార్​!

ABOUT THE AUTHOR

...view details