Best Foods to Increase Lifetime :ప్రస్తుత ఉరుకులు పరుగుల ప్రపంచంలో చాలామంది తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. పని హడావుడిలో పడి శరీరానికి ఏం కావాలో, ఏం చేస్తే ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటామో అనే విషయాన్ని మర్చిపోతున్నారు. నిజానికి మన రోజూవారి జీవన విధానం, ఆహారశైలిలో మార్పులు చేస్తే మనిషి తన జీవితకాలాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. కొన్ని రకాల ఆహారాలని(Foods)తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం బతకొచ్చని చెబుతున్నారు. నవంబర్ 20న నేచర్ ఫుడ్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఇందుకోసం UK బయోబ్యాంక్ నుంచి డేటాను ఉపయోగించారు. ఈ అధ్యయనంలో ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆయుష్షు పెంచుకోవచ్చో సూచించారు. దీని ప్రకారం కొన్ని రకాల ఆహారాలని తీసుకుంటే పురుషులు, మహిళలు మరో 10 ఏళ్లు జీవితకాలం పెంచుకోవచ్చు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
These Foods Increase Life Expectancy 10 Years :ఈ అధ్యయనంలో ఆరోగ్యకరమైన అలవాట్లు ఫాలో అయితే.. జీవిత కాలాన్ని గణనీయంగా పెంచుకోవచ్చం టున్నారు. అంటువ్యాధి వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని కాపాడుకోవచ్చని తేలింది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల నుంచి కొన్ని ఆరోగ్యకర ఆహార విధానాలకు మారడంతో ఆయుష్షును మరో పదేళ్లు కాపాడుకోవచ్చు. ఈ అధ్యయనం ప్రకారం.. ఒక మహిళ 40 సంవత్సరాల వయసులో తన ఆహార అలవాట్లు మార్చుకోవడం ప్రారంభిస్తే తన జీవిత కాలాన్ని 8.6 సంవత్సరాలు పెంచుకోవచ్చు. అలాగే 40 సంవత్సరాల వయసు ఉన్న ఒక పురుషుడు తన ఆయుష్షు 8.9 సంవత్సరాలు పెంచుకోవచ్చని అధ్యయనంలో వెల్లడైంది.