తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పళ్లు శుభ్రంగా లేకపోతే... మతిమరుపు వస్తుందటా...!

మతిమరుపు దరిజేరకూడని అనుకుంటున్నారా? అయితే దంతాలు, చిగుళ్లు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. దంతాలు శుభ్రంగా లేకుండా మతిమరుపు ఎలా వస్తుందని ఆలోచిస్తున్నారా...? అయితే ఈ స్టోరీ చదివితే మీకే తెలుస్తుంది.

teeth cleanness avoid memory loss
teeth cleanness avoid memory loss

By

Published : Sep 2, 2020, 4:38 PM IST

పళ్లకూ మతిమరుపునకు సంబంధం ఏంటీ...? అనుకుంటున్నారా... తీవ్రమైన చిగుళ్ల జబ్బుతో ముడిపడిన పి.జింజివలిస్‌ బ్యాక్టీరియా అల్జీమర్స్‌ బాధితుల మెదళ్లలోనూ ఉంటున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది మరి. నోట్లో పి.జింజివలిస్‌ ఇన్‌ఫెక్షన్‌ మూలంగా మెదడులో అమీలాయిడ్‌ బీటా అనే ప్రోటీన్‌ పోగుపడే ప్రక్రియ పుంజుకుంటోందనీ తేలింది. అల్జీమర్స్‌కు మెదడులో అమీలాయిడ్‌ ప్రోటీన్‌ పోగుపడటం ప్రధాన సూచిక. కాబట్టి దంతాల శుభ్రత మీద కాసింత దృష్టి పెడితే ఎప్పుడో ఎదురయ్యే అల్జీమర్స్‌ ముప్పును ఇప్పట్నుంచే తగ్గించుకోవచ్చన్నమాట.

ఇదీచూడండి..' వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగడం సంతోషకరం'

ABOUT THE AUTHOR

...view details