Sperm Count Increase Food: సంతాన సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. మగవారిలో కనిపించే ఇన్ఫెర్టిలిటీ సమస్యల్లో దాదాపు 90 శాతం వరకు స్పెర్మ్ కౌంట్ (వీర్య కణాలు) లోపం వల్ల వచ్చేవే. స్పెర్మ్ కౌంట్ తగినంతగా లేకపోతే వారికి సంతానం కలగడం కష్టమే. ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఆధునిక జీవన విధానమే కారణమంటున్నారు నిపుణులు. కొన్ని సాధారణ అలవాట్ల కారణంగా కూడా వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుందని పేర్కొన్నారు.
వీర్య కణాలు తగ్గాయా .. అయితే ఈ టిప్స్ పాటించండి - వీర్య కణాలు పెంపు
Sperm Count Increase Food: సంతానోత్పత్తిని ప్రభావితం చేసే ప్రధాన కారకాలలో వీర్య కణాల నాణ్యత ఒకటి. స్పెర్మ్ కౌంట్ తగినంతగా లేకపోతే సంతానం కలగడం కష్టమే అని చెప్పవచ్చు. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
![వీర్య కణాలు తగ్గాయా .. అయితే ఈ టిప్స్ పాటించండి వీర్య కణాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14977221-thumbnail-3x2-ddd.jpg)
వీర్య కణాలు
మరి ఈ సమస్యకి చెక్ పెట్టాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే ఉత్తమ మార్గం అని చెప్తున్నారు. ఆహారంలో మైక్రోన్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చుని సూచిస్తున్నారు. విటమిన్-సి, విటమిన్-ఇ, ఫోలేట్ యాసిడ్, జింక్ మొదలైనవి ఉన్న ఆహార పదార్ధాలు తీసుకోవడం ద్వారా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందని అంటున్నారు. మరి వీర్యకణాల వృద్ధికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
- గుడ్లు
- మాంసం
- పండ్లు
- పాలు
- జీడిపప్పు
- బాదం పప్పు
- కిస్మిస్
- ఎండు ద్రాక్ష
ఇదీ చదవండి:గుమ్మడికాయతో క్యాన్సర్లకు చెక్!