గుడ్లు:వ్యాధి కారకాలతో పోరాడే పోషకాలున్న సూపర్ ఫుడ్ ఇది. ఒక గుడ్డు నుంచి దాదాపు ఏడు గ్రాముల ప్రొటీన్, 75 కెలొరీల శక్తి లభిస్తాయి. ఆకుకూరలు లేదా బ్రెడ్‌తో కలిపి ఆమ్లెట్‌గా, మఫిన్స్‌గా, ఉడికించి ఏ విధంగా అయినా తీసుకోండి. రోజూ కనీసం రెండు గుడ్లు తినాల్సిందే. అప్పుడే ఫలితం ఉంటుంది.
ఓట్స్:పీచుతో కూడిన వీటిని తీసుకుంటే పొట్ట నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. శరీరానికి కావాల్సిన పోషణ,శక్తి అందుతాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీన్ని ఉప్మాలా చేసుకోవచ్ఛు లేదా పిండిలో కలిపి దోసెలు, ఊతప్పమ్, చిల్లాస్‌లా వేసుకుని తీసుకోవచ్ఛు ప్రాసెస్ చేయని ఓట్స్‌లో పోషకాలు మెండుగా ఉంటాయి.