తెలంగాణ

telangana

By

Published : May 15, 2021, 3:31 PM IST

ETV Bharat / sukhibhava

బ్లాక్ ఫంగస్ ముప్పు వారిలో ఎక్కువే..!

ఇటీవల కొవిడ్ నుంచి కోలుకున్న వారిని ఈ మధ్య కొత్తగా బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బ్లాక్ ఫంగస్ సమస్యను పరిష్కరించటానికి కొన్ని సూచనలను చేసింది.

Rising cases of the black fungal infection in India
భయపెడుతోన్న బ్లాక్ ఫంగస్

దేశ వ్యాప్తంగా కరోనా విధ్వంసం సృష్టిస్తుంటే.. కరోనా నుంచి కోలుకున్న వారు మరో ప్రమాదానికి గురవుతున్నారు. అదే నల్ల శిలీంధ్రం. వేగంగా వ్యాప్తి చెందుతూ చికిత్స ఆలస్యమైతే ప్రాణాంతకంగా మారుతోంది.

బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి?

వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వారిలోకి బ్లాక్ ఫంగస్ చొరబడి ప్రాణాలు హరిస్తుంది. మ్యూకోర్ మైకోసిస్ రక్తంలో చెక్కెర నిల్వలు అధికంగా ఉంటే మరింత ప్రమాదకరంగా మారుతోంది. స్టెరాయిడ్స్ వాడిన వాళ్లలో ఈ ప్రమాదం ఎక్కువ. మధుమేహం ఉన్న వారు కోవిడ్ చికిత్సలో స్టెరాయిడ్స్ వాడితే బ్లాక్ ఫంగస్ సులభంగా వ్యాపిస్తుంది. సత్వరం దీనిని నిర్ధరణ చేస్తేనే చికిత్సించగలం. మ్యూకోర్ మైకోసిస్ ను మ్యూకోసైటిస్ అనే శిలీంధ్రం కలుగచేస్తుంది. ఇది అంతటా విస్తరించి ఉంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గిన వారిలో దీని సిద్ధ బీజాలు ఊపిరితిత్తుల్లోకి చేరి శోథను కలుగచేస్తాయి. చర్మంపై గాట్లు ఉన్నా చర్మంలోకి చొరబడతాయి.

ఐసీఎంఆర్​ సూచనల మేరకు ఈ కింది వారిలో బ్లాక్ ఫంగస్ ప్రమాదం ఉంటుంది.

  • అదుపులో లేని మధుమేహం
  • స్టెరాయిడ్స్ అధిక వాడకం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గటం
  • దీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండటం
  • క్యాన్సర్, అవయువ మార్పిడి ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారు
  • ఒరికొనజోల్ చికిత్స తీసుకున్న వారు

లక్షణాలు:

  • సైనుసైటిస్-ముక్కుదిబ్బడ, నలుపు రంగులో ముక్కుకారటం, దవడ, చక్కిళ్లు నొప్పి
  • మొహంపై ఒక వైపు నొప్పి, తిమ్మిరి, వాపు
  • ముక్కుదూలంపై, అంగళిపై నలుపు రంగు
  • పంటి నొప్పి, వదులు పళ్లు, దవడ నొప్పి
  • అస్పష్ట కంటి చూపు, నొప్పి, జ్వరం, చర్మంపై పుండ్లు
  • ఛాతీలో నొప్పి, దగ్గితే రక్తం, ఆయాసం

చేయదగినవి:

  • రక్తంలో చెక్కెర అదుపులో ఉండాలి
  • స్టెరాయిడ్స్ వైద్యుని పర్యవేక్షణలోనే వాడాలి
  • గదిలో పరిశుభ్రత పాటిస్తూ పరిశుభ్రమైన నీటినే హ్యుమిడిఫైయర్స్ (ఎయిర్ కూలర్స్)లో వాడాలి
  • యాంటి బయాటిక్స్ / యాంటి ఫంగల్స్ వాడకంలో అదుపు ఉండాలి.

చేయకూడనివి:

  • బ్లాక్ ఫంగస్ లక్షణాలను నిర్లక్ష్యం చేయటం
  • వైద్య పరీక్షలకు వెళ్లకపోవటం

ఈ లక్షణాలు కనిపించగానే మీ వైద్యున్ని కానీ.. కింద సూచించిన వారిని కానీ సంప్రదించాలి.

  • మైక్రోబయాలజిస్ట్
  • వైద్య నిపుణులు
  • న్యూరాలజిస్ట్
  • చెవి, ముక్కు, గొంతు వైద్యులు
  • దంత వైద్యులు
  • బయో కెమిస్ట్
  • ప్లాస్టిక్ సర్జన్

ABOUT THE AUTHOR

...view details