మనం రోజూ ఎదుర్కొనే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు మన వంటింట్లోనే ఉంటాయని మరచి... మార్కెట్లో వేలకు వేలు పోసి మందులు, కాస్మొటిక్స్ కొంటాం. పైగా వంటింటి చిట్కాల వల్ల మన శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని చెబుతుంటారు నిపుణులు. ఈ క్రమంలో బియ్యం కడిగిన నీటితో కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం రండి..
బియ్యం కడిగిన నీటితో అందం, ఆరోగ్యం! ఎలా తయారు చేయాలి..?
నానబెట్టడం
- ఒక అర కప్పు బియ్యాన్ని గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడగాలి.
- ఆ బియ్యాన్ని రెండు/మూడు కప్పుల నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
- నానబెట్టిన నీటిని ఒక శుభ్రమైన గిన్నెలోకి వేరు చేయాలి.
ఉడికించడం
- ఒక అరకప్పు బియాన్ని గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడగాలి.
- అందులో సాధారణంగా బియ్యం ఉడకడానికి పోసే నీళ్ల కంటే రెండింతలు ఎక్కువ నీటిని పోసి ఉడికించాలి.
- బియ్యం ఉడుకుతుండగా మిగిలిన నీటిని ఒక శుభ్రమైన గిన్నెలోకి తీసుకోవాలి.
బియ్యం కడిగిన నీటితో అందం, ఆరోగ్యం! చర్మానికి మేలు చేస్తుంది..!
రైస్ వాటర్‌లో అధికశాతంలో విటమిన్లు, మినరల్స్, అమైనో యాసిడ్స్ ఉంటాయి. చర్మాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో ఈ నీటిని వాడడం ద్వారా మన చర్మం మృదువుగా మారుతుంది. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
బియ్యం కడిగిన నీటితో అందం, ఆరోగ్యం! ఫేషియల్ టోనర్‌గా..
రైస్ వాటర్‌ని ఫేషియల్ టోనర్‌గా కూడా వాడొచ్చు. ఒక కాటన్ ప్యాడ్‌పై ఈ నీటిని పోసి.. దానితో ముఖంపై మృదువుగా రాయాలి. అలా కొన్ని నిమిషాలు ఉంచిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా వారంలో కనీసం రెండుసార్లు చేయడం ద్వారా చర్మం పొడిబారడం తగ్గుతుంది. అంతేకాకుండా చర్మంపై ఉండే ముడతలు కూడా క్రమంగా తగ్గుతాయి.
బియ్యం కడిగిన నీటితో అందం, ఆరోగ్యం! సన్‌బర్న్స్ నుంచి ఉపశమనం..!
అధిక ఉష్ణోగ్రతల వల్ల సున్నితమైన ప్రదేశాల్లో చర్మం కందిపోతుంటుంది. ఇలాంటి సమయాల్లో రైస్ వాటర్‌ని ఉపయోగించొచ్చు. ఒక కాటన్ ప్యాడ్‌పై ఈ నీటిని కొద్దిగా వేసి కందిపోయిన ప్రదేశాల్లో మృదువుగా రుద్దండి. దీనివల్ల మంట తగ్గుతుంది.
బియ్యం కడిగిన నీటితో అందం, ఆరోగ్యం! ఆరోగ్యవంతమైన జుట్టు కోసం..!
రైస్ వాటర్‌తో కడగడం వల్ల జుట్టుకు కావాల్సిన పోషకాలు అంది బలంగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు ఆకర్షణీయంగా మెరుస్తుంది కూడా. ఇందుకోసం షాంపూతో తలస్నానం చేసిన తర్వాత రైస్ వాటర్‌ని తలపై పోసి.. ఆ నీరు కుదుళ్లకు చేరేలా మసాజ్ చేయండి. అలా కొన్ని నిమిషాలు చేసిన తర్వాత శుభ్రమైన నీటితో జుట్టును కడిగేయండి. ఇలా వారంలో రెండుసార్లు చేయడం వల్ల ఫలితం తప్పక కనిపిస్తుంది.
ఇదీ చదవండి: మనసు బాలేదా? అయితే ఇలా చేయండి...