రతిలో పాల్గొని భావప్రాప్తి అనుభూతిని పొందాలని చాలా మంది అనుకుంటారు. తమ భాగస్వామితో కలయికను ఆస్వాదించాలనుకుంటారు. కానీ పలు సందర్భాల్లో ఈ కలయికే మహిళకు సమస్యగా మారుతుంది. యోని భాగం బిగుసుకుపోవడమే అందుకు కారణం. ఇందుకు సర్జరీనే పరిష్కారమని చాలా భావిస్తుంటారు. కానీ అదంతా అపోహ అని, నిజానికి సర్జరీ అందుకు పరిష్కారం కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కలయిక కుదరకపోతే మహిళ సర్జరీ చేయించుకోవాలా? - సెక్స్ టిప్స్
సెక్స్‌లో పాల్గొని ఆ అనుభూతిని పొందేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొంతమంది పలు కారణాల వల్ల శృంగారాన్ని ఆస్వాదించలేకపోతారు. కలయిక కుదరక నిరాశ చెందుతుంటారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇలాంటి సందర్భాల్లో సెక్స్‌ను ఆస్వాదించాలంటే మహిళా భాగస్వామి సర్జరీ చేయించుకోవాలా? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..
"కలయిక కుదరకపోవడం అనేది అసలు ఉండదు. ఇందుకు సర్జరీ అవసరం లేదు. సర్జరీ అంటే.. యోని దగ్గర నరాన్ని కొంచెం కట్ చేస్తారు. అలాంటిది ఏం అవసరం లేదు. మహిళల్లో భయం వల్ల వారి యోని బిగుసుకుపోతుంది. దీనికి పరిష్కారం కావాలంటే.. వారిని ప్రశాంతంగా, ఎలాంటి ఆందోళన లేకుండా చేయగలగాలి. సెక్స్‌కు ముందు ఫోర్‌ప్లే చేయాలి. ఈ క్రమంలో డైలటేషన్ చేస్తే సరిపోతుంది." అని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఫ్రీగా మైండ్ ఉంచుకుని ఇద్దరూ సహకరించుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవంటున్నారు. ఇది కాదని సర్జరీ చేయించుకుంటే లేనిపోని సమస్యలు తలెత్తుతాయని.. కొన్ని రోజుల పాటు బాగా ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు. యోని మార్గంలో ఏమైనా సెప్టం ఉంటే దానిని తొలగించేందుకు సర్జరీ అవసరం కానీ ఇలాంటి వాటికి కాదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి :ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే.. సెక్స్‌ను ఆస్వాదించగలరా?