Sleep Position Effects: రోజూ సగటున 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతుంటారు. అయితే ప్రస్తుతకాలంలో చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోవట్లేదు. కంటికి నిద్ర దూరమైతే ఎన్నో రకాల వ్యాధులకు దారి తీస్తుందని చాలా మందికి తెలియదు. సరిగా నిద్రపోక లేనిపోని రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. అయితే.. నిద్ర పోవడం అనేది శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అధిక శారీరక శ్రమ చేసేవారికి మంచి నిద్ర ఉంటుందని అంటున్నారు.
అలాగే మనం నిద్ర పోయే విధానాలు, భంగిమలు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తాయి. డైరెక్ట్‌గా కాకున్నా.. నిద్ర పోయే తీరు కచ్చితంగా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్నిసార్లు ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా వెల్లకిలా అంటే నడుంపై పడుకోవడం కరెక్ట్ కాదని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల నడుం నొప్పి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయని సెలవిస్తున్నారు. గురకపెట్టి నిద్రపోయేవారు స్ట్రెయిట్‌గా పడుకోవడం మంచిది కాదంట. భుజాలపై పడుకోవడం వెన్నెముక, మెడ ఆరోగ్యానికి మంచిదని.. కానీ ఈ భంగిమ గురక సమస్యకు దారి తీయొచ్చని వివరిస్తున్నారు. ఇంకా ఎలాంటి భంగిమలు మంచి నిద్రకు కారణమవుతాయి? ఏ పొజిషన్లు.. ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయో ఈ వీడియోలో చూడండి.