మొన్న సార్స్, నిన్న ఎబోలా, నేడు కరోనా.. ఇలా కొన్నేళ్లుగా ఏదో ఒక వైరస్ మానవాళిని వణికిస్తూనే ఉంది. భవిష్యత్‌లో ఇంకేం వైరస్ దాడి చేస్తుందో తెలియదు. ఇదే కాదు.. సీజన్ మారగానే వచ్చే జలుబు, ఫ్లూ, డెంగీ జ్వరాలకు కారణమూ వైరస్సే. కాబట్టి వాటిని ఎదుర్కొనేందుకు మన శరీరాన్ని సిద్ధం చేయాలి. అందుకు రోగనిరోధకశక్తిని(Immunity) పెంచుకోవాలి. మరి ఏ ఆహారం తింటే ఇది పెరుగుతుందో చూద్దాం..
పుచ్చకాయ: ఇందులో ఉండే గుట్లాథియాన్ యాంటిఆక్సిడెంట్స్ వలన ఇమ్యునిటీ పెరుగుతుంది.
క్యాబేజి: ఇందులో ఉండే గ్లుటమైన్ వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. దీన్ని కూర లేదా సలాడ్‌గా తీసుకోవచ్చు.
బాదంపప్పు: పావ్ కప్పు తీసుకుంటే ఆ రోజుకు సరిపడ విటమిన్-ఇ మోతాదు సగం దొరికినట్టే.
పెరుగు: రోజుకు ఓ కప్పు తింటే జలుబు రాకుండా, విటమిన్ డి లోపం లేకుండా చేస్తుంది. జబ్బులతో పోరాడే శక్తిని పెంచుతుంది.