తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

సులభంగా సన్నగా అయిపోవడానికే ఈ సూత్రాలు! - changing habits to lose weight

టీనేజీలో చాలామంది ఎదుర్కొనే సమస్య ఊబకాయం. బరువు అనేది రాత్రికి రాత్రే పెరిగిపోదు. మన ఆహారపు అలవాట్లూ, పద్ధతులూ కూడా ప్రభావం చూపుతాయి. కాబట్టి ఏయే విషయాల్లో మార్పులు చేస్తే సులభంగా సన్నగా మారతామో తెలుసుకుందాం రండి..

how-to-get-slim-easily-with-simple-tips
సులభంగా సన్నగా అయిపోవడానికే ఈ సూత్రాలు!

By

Published : Sep 29, 2020, 10:31 AM IST

కొన్ని సూత్రాలు పాటిస్తే చాలు సులభంగా సన్నగా మారిపోతారంటున్నారు వైద్యులు.. అవేంటో చూసేయండి...

  • టీవీ చూడటం, వీడియో గేమ్స్‌ ఆడటం, గంటల తరబడి ల్యాప్‌టాప్‌లో సర్ఫింగ్‌ చేయడం... ఈతరం ఎక్కువగా చేస్తోన్న పనులివి. ముందు వీటికి చెక్‌ పెట్టాలి. ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల తెలియకుండానే బరువు పెరిగిపోతారు. కాబట్టి వాటిని చూసే సమయాన్ని సగానికి సగం తగ్గించుకోవాలి. టీవీ చూడాలని ఉంటే చిన్నచిన్న వ్యాయామాలు చేస్తూనే చూడండి తప్ప అదేపనిగా కూర్చుని కాదు.
  • రోజూ తీసుకునే ఆహారంపై కూడా దృష్టి పెట్టాలి. నూనె, ఉప్పూ, మసాలా పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాగే ఆరోగ్యాన్నిచ్చే తాజా పండ్లూ, కాయగూరల మోతాదును పెంచాలి. ఉప్పూ, చక్కెరలు ఎక్కువగా ఉండే చిప్స్‌, శీతలపానీయాల్లాంటివి ఒకసారి తీసుకోవడం మొదలుపెట్టాక అవి అలవాటుగా మారతాయి. కాబట్టి వీటినీ తగ్గించాలి.
  • ఎక్కడికి వెళ్తోన్నా సరే... వీలైనంతవరకూ నడవడం, మెట్లు ఉంటే ఎక్కడం అలవాటుగా చేసుకోవాలి. దీనివల్ల మనకు తెలియకుండానే కొన్ని కేలరీలు కరుగుతాయి.
  • పైవన్నీ చేస్తూనే రోజూ ఓ అరగంటసేపు వ్యాయామం చేసేందుకు కేటాయించాలి. నడకా, పరుగే కాదు కండరాలను దృఢపరిచేవీ, పుషప్స్‌, స్క్వాట్స్‌, ప్లాంక్స్‌ ఎంచుకోవడం వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.

ABOUT THE AUTHOR

...view details