తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మెంతులు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు

నిత్యం మనం వంటల్లో ఎన్నో రకాల పదార్థాలు ఉపయోగిస్తుంటాం. కానీ నిపుణులు పరిశోధన చేసి వాటి ప్రయోజనాలు చెబితే ఔరా అని ఆశ్చర్యపోతాం. మధుమేహం, అధిక బరువు, కొలెస్ట్రాల్​ వంటి సమస్యలకు మెంతులు (uses of dill) ఔషధంగా పనిచేస్తాయి. మనదేశంలో వేల సంవత్సరాలుగా ఉన్న (benefits of dill) ఆయుర్వేదం... మెంతులను ప్రతి రోజూ ఆహారంలో వాడమంటోంది.

benefits of dill
మెంతుల ఉపయోగాలు

By

Published : Oct 9, 2021, 4:39 PM IST

మేలిమి బంగారు వర్ణంలో మెరిసిపోయే మెంతులను మన ఆహారం పాలిట (benefits of dill) అమృత మూలికలని చెప్పుకోవాలి. ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఇవి ఔషధంగా పనిచేస్తాయి. శరీరంలో తగినంత వేడిని ఉత్పత్తి చేసి జీర్ణవ్వవస్థను (uses of dill) మెరుగుపరుస్తాయి. ఈ సందర్భంగా మెంతులతో కలిగే ప్రయోజనాలు (dill uses) ఏంటో తెలుసుకుందామా?

  • పీసీఓడీ, అధిక కొలెస్ట్రాల్​, షుగర్ వ్యాధి, అధిక బరువు సమస్యను మెంతులు బాగా తగ్గిస్తాయి. రాత్రిపూట మెంతులను పెరుగులో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే చక్కని ఔషధంగా పనిచేస్తాయి.
  • శరీరంలో విషాన్ని బయటికి పంపించి ఆరోగ్యంగా ఉంచడానికి బాగా ఉపయోగపడతాయి.
  • పెరుగులో కలుపుకొని మెంతులను తీసుకుంటే మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్ణం తగ్గించే గుణం వీటికి ఉంటుంది.
  • మెంతులను నేతిలో వేయించి, కొద్దిగా సైందవ లవణాన్ని కలిపి మజ్జిగలో తీసుకున్నట్లయితే విరేచనాలు తగ్గుతాయి.
  • మెంతులు, బెల్లం కలిపి ముద్దలా చేసుకుని తింటే తల్లిపాలను వృద్ధి చేసే గుణం కూడా ఉంటుంది.
  • కఫానికి, వాతానికి వ్యతిరేకంగా మెంతులు పనిచేస్తాయి.
  • జిడ్డుగా ఉండే చుండ్రు తగ్గించడానికి కూడా మెంతులు బాగా పనిచేస్తాయి.
  • నడుము నొప్పి, సయాటికా, కీళ్ల నొప్పి, కండరాల నొప్పితో బాధపడుతున్న వారికి మెంతులు ఉపశమనం కలిగిస్తాయి.
  • మెంతులతో తయారు చేసిన 'టీ' ని తీసుకోవడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు తగ్గుతాయి.

ABOUT THE AUTHOR

...view details