తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఆ మహిళలు శృంగారం పట్ల ఆసక్తి చూపరు ఎందుకు?

Women Not Interested in Sex: శృంగారంలో పాల్గొనాలనే కోరిక, ఆసక్తి పురుషులకు ఉన్నట్లుగానే మహిళలకు కూడా ఉంటుందా? లేక వారిలో సెక్స్​ అంటే అసలు ఆసక్తి లేని వారు కూడా ఉంటారా?.. అనే సందేహం చాలా మందికి వస్తుంది. అయితే శృంగారం అంటే అసలు ఆసక్తి లేని మహిళలు కూడా ఉంటారని, దానికి పలు కారణాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Women Not Interested in Sex
హెల్త్​ ఎక్స్​పర్ట్స్​

By

Published : Apr 20, 2022, 6:47 AM IST

Women Not Interested in Sex: శృంగారంపై పురుషులకు ఉన్నట్లుగానే మహిళల్లో కూడా ఆసక్తి ఉంటుంది. అయితే కొందరు మహిళలు మాత్రం అసలు సెక్స్​ అంటే ఆసక్తి చూపరు. ఇందుకు వారు అనుసరించే సభ్యత, సంస్కారాలే ప్రధాన కారణమనే వాదన ఉంది. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..

ఇంట్లో వాళ్ల పెంపకం మహిళలకు సెక్స్​పైన ఆసక్తి తగ్గేలా చేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. "చిన్నప్పటి నుంటి సెక్స్​ అంటే తప్పు.. స్త్రీలు శృంగారం​ పట్ల ఆసక్తి చూపించడం సరైన పద్ధతి కాదు, స్త్రీలు అలా ఉండకూడదు అనే ఒక భావజాలంతో వాళ్లను పెంచుతారు. పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి.. అంతే తప్ప సెక్స్​ గురించి మాట్లాడటం వంటివి చేయకూడనే భావజాలానికి ప్రభావితమైన వారు శృంగారం పట్ల ఆసక్తి చూపించరు" అని నిపుణులు పేర్కొన్నారు.

శృంగారం పట్ల మహిళలకు ఆసక్తి లేకపోవడానికి మరో కారణం హైపోథైరాయిజం. థైరాయిడ్​ హార్మోన్​ తక్కువ ఉన్నా, ఈస్టర్న్​ హార్మన్స్​ తక్కువ ఉన్నా కూడా సెక్స్​పైన ఆసక్తి తగ్గుతుంది. పాలిసిస్టిక్​ ఒవేరియన్​ డిసీజ్​ ఉన్న వారిలో యాండ్రోజెన్స్​ ఎక్కువ పెరుగుతాయి. అంటే మగవాళ్ల హార్మోన్లు పెరుగుతాయి. రక్త హీనత, స్ట్రెస్​, రిలేషన్​షిప్​ ప్రాబ్లమ్ ఉన్నా కూడా సెక్స్​పైన ఆసక్తి తగ్గిపోతుంది. వైద్యులను సంప్రదించి సైకో థెరపీ​ చేయించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

ఇదీ చూడండి:పగలు సెక్స్ చేయకూడదా? కవలలు పుట్టాలంటే ఎలా? మీ 16 డౌట్స్​కు జవాబులు ఇవిగో..

ABOUT THE AUTHOR

...view details