తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

వెక్కిళ్లు ఆగడం లేదా? యాలకులతో ఇలా చేయండి! - యాలకులు వల్ల ఉపయోగాలు

ఎన్నో ఔషధ గుణాలు గల యాలకులు ఆరోగ్యంగా ఉండడంలో (Elaichi Benefits) కీలక పాత్ర పోషిస్తాయి. జీర్ణ శక్తి పెరుగుదల, మానసిక ఒత్తిడికి నుంచి విముక్తి లభించడమే కాక మరెన్నో సమస్యలకు యాలకులతో చెక్​ పెట్టొచ్చు.

benefits of elaichi
యాలకులతో ప్రయోజనాలు

By

Published : Oct 27, 2021, 1:12 PM IST

సువాసన ద్రవ్యాల రాణిగా పేరు పొందిన యాలకులను (Elaichi Benefits) వంటకాలలో రుచి కోసం మాత్రమే వాడతారని చాలా మంది అనుకుంటాం. కానీ ఈ యాలకుల రుచే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. వీటిలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే (Elaichi Benefits) ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే వీటిని ఆయుర్వేదంలో ఎన్నో ఔషధాల తయారీలో వీటిని ఉపయోగిస్తారు. మరి ఈ యాలకులతో ఇంకేం లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం.

  • నీరసాన్ని పోగొట్టి ఆకలిని పెంపొందించడంలో యాలకులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సువాసన కలిగిన ఈ యాలక గింజలు కడుపు నొప్పిని నయం చేయడం సహా జీర్ణ శక్తిని పెంపొందిస్తాయి. నోటి దుర్వాసన పోగొట్టడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
  • ఆయుర్వేద వైద్యంలో ఆస్తమా, డస్ట్​ అలర్జీ, కిడ్నీలో రాళ్లు ఇంకా బలహీనతను పోగొట్టడంలో యాలకులను ఉపయోగిస్తున్నారు.
  • మానసిక ఒత్తిడికి గురైన వారు యాలకుల టీ తాగితే ప్రశాంతత పొందుతారు.
  • ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఏర్పడే తలనొప్పి, వాంతులు, ఊపిరితిత్తుల్లో కపం మొదలైన సమస్యలకు కేవలం యాలకులను నోట్లో వేసుకుని నమిలితే నివారణ లభిస్తుంది.
  • నాలుగైదు యాలక్కాయలను చితకొట్టి.. అరగ్లాసు నీటిలో వేసి కషాయంలా కాచి అందులో కొంచెం పటిక బెల్లం పొడి కలుపుకొని తాగితే తలతిరుగుడు వెంటనే తగ్గిపోతుంది.
  • వెక్కిళ్లను ఆపగలిగే శక్తి యాలకులకు ఉంది. రెండు యాలకులను చితకొట్టి పుదీనా ఆకులను వేసి అరగ్లాసు నీటిలో బాగా కాచి వడకట్టాలి.. తర్వాత గోరు వెచ్చగా అయ్యే వరకు చల్లార్చి తాగితే వెంటనే వెక్కిళ్లు ఆగిపోతాయి.

ABOUT THE AUTHOR

...view details