తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కరోనా కాలంలో చేతులకు పూతలే రక్షణ! - Corona virus precautions

ముఖానికి మాస్క్‌.. చేతికి గ్లౌజు... అడుగడుగునా శానిటైజర్లు... మన ఆహార్యంలో, అలవాట్లలో అనూహ్యమైన మార్పులు. ఒక్కసారిగా మారిన ఈ జీవనశైలిలో అవి మాత్రమే సరిపోవు. మాస్క్‌లతోపాటు జాగ్రత్తలు... శానిటైజర్లకు మాయిశ్చరైజర్లు జత చేయాల్సిందే. ఆరోగ్యంతోపాటు సంరక్షణ కూడా కీలకమే అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు మీకోసం...

HAND SANITIZE PRECAUTIONS
కరోనా కాలంలో చేతులకు పూతలే రక్షణ!

By

Published : May 1, 2020, 12:38 PM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

శానిటైజర్‌ రాసుకున్న ప్రతిసారీ మాయిశ్చరైజర్‌ రాయడం అలవాటు చేసుకోవాలి. లేకపోతే చర్మం పొడిబారి బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. వైరస్‌ కూడా త్వరగా లోపలికి చొచ్చుకుపోయే ప్రమాదముంది. ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్‌ రాసుకుంటే ఇన్‌ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. రకరకాల పనుల మీద బయటకు వెళ్లేవాళ్లు శానిటైజర్‌ తప్పనిసరిగా వాడాలి. కానీ ఇంట్లో ఉండేవాళ్లు దీనికి బదులుగా సబ్బుతో చేతులు కడుక్కోవచ్చు. పరిశుభ్రంగా ఉంటూనే మాయిశ్చరైజర్‌ రాసుకుంటూ చేతులు పొడిబారకుండా చూసుకోవచ్చు.

సొంత ప్రయోగాలు వద్దు..

సొంత ప్రయోగాలు వద్దు

శానిటైజర్ల కొరత వల్ల కొంతమంది వాటిని ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ప్రమాదం కూడా ఉంటుంది. వీటి తయారీలో ఆల్క్‌హాల్‌ శాతాన్ని సరిగ్గా అంచనా వేయలేం. ఒకవేళ ఇది ఎక్కువైతే చేతులు ఎర్రగా మారి, మంటలు పుట్టవచ్చు. తక్కువైతే రాసుకున్నా ఎలాంటి ఫలితమూ ఉండదు.

దుష్ప్రభావాలు..

ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలామంది అరగంటకోసారి శానిటైజర్‌ రాసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చేతులు పొడిబారడం, పగుళ్లు రావడం, పగుళ్ల నుంచి రక్తం రావడం జరుగుతుంది. కళ్ల మంట, శరీరమంతా దురదలు వస్తాయి. కొందరిలో దగ్గు, మరికొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వంటి సమస్యలు ఎదురవుతాయి.

చేతులకు ఈ ప్యాక్‌లు...

  • చెంచా కొబ్బరినూనె లేదా ఇంట్లో ఉండే ఏదైనా వంటనూనెలో టీస్పూన్‌ తేనె, కొద్దిగా పాలపొడి కలిపి పేస్టులా చేసి చేతులకు రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేయాలి.
  • చెంచా పాల మీగడలో కొద్దిగా తేనె, మెంతుల పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని అరచేతులకు పట్టించి బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. అలాగే... శానిటైజర్‌ రాసుకున్న తర్వాత వంట నూనెను వాడినా ఫలితం ఉంటుంది.

చిట్కాలు...

  1. దోసకాయ గుజ్జు, ఓట్స్‌ టీస్పూన్‌ చొప్పున తీసుకోవాలి. దీంట్లో అయిదారు చుక్కల కొబ్బరినూనెను కలపాలి. దీన్ని చేతులకు పట్టించి పావుగంట తర్వాత కడుక్కోవాలి.
  2. రెండు చెంచాల పాలు, టీస్పూను కలబంద, కొద్దిగా అరటిపండు గుజ్జును తీసుకుని పేస్టులా చేయాలి. దీన్ని చేతులకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
  3. శానిటైజర్‌ తర్వాత కొబ్బరినూనె రాసుకుంటే చేతులు పొడిబారడం అనే సమస్య ఉండదు.
  4. ఇంట్లో ఉన్నప్పుడు శానిటైజర్‌ని వాడాల్సిన అవసరం లేదు. సబ్బుతో చేతులు కడుక్కుంటే సరిపోతుంది. శానిటైజర్‌ రాసుకుని వంట చేస్తే ఆ వేడికి చేతులు కాలే ప్రమాదముంది.

అలెర్జీలు రాకుండా..

  • బయటకు వెళ్లేటప్పుడు కాటన్‌ వస్త్రంతో తయారుచేసిన డబుల్‌ లేయర్‌ మాస్కులను ఉపయోగించాలి. రోజూ మాస్కును ఉతికి ఎండలో ఆరబెట్టాలి. ఇలాచేస్తే చర్మ అలెర్జీలు రావు. వాడిందే వాడితే పిగ్మెంటేషన్‌ సమస్య రావొచ్చు.
  • కొందరు ఒకటే మాస్కును అదేపనిగా వాడుతుంటారు. సాధారణ జలుబు వచ్చినాసరే మళ్లీ అది వాడొద్దు.
    డాక్టర్ సూరపనేని శైలజ, కాస్మొటాలజిస్ట్‌

- డా. సూరపనేని శైలజ, కాస్మొటాలజిస్ట్‌

ఇదీ చదవండి:కరోనాపై రోబోతో కృష్ణుడి సమరం

Last Updated : May 21, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details