తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

నడుం నొప్పికి బంతితో చెక్ పెట్టండిలా...‌! - ఆరోగ్యానికి వ్యాయామం

ఆరోగ్యానికి వ్యాయామం ఈ రోజుల్లో తప్పనిసరి. చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాల్ని అందిస్తాయి. అలాంటివాటిల్లో ఇవి కొన్ని...

Exercise for health tips
నడుం నొప్పికి బంతితో చెక్ పెట్టండిలా...‌!

By

Published : Aug 13, 2020, 1:05 PM IST

కుర్చీలో ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల శరీరం మొత్తానికి రక్తప్రసరణ సక్రమంగా ఉండదు. అదే స్విస్‌ బంతి మీద కూర్చోవడం వల్ల శరీరం నిటారుగా ఉంటుంది. నడుం నొప్పి బాధించదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

  • రోజూ మెట్లెక్కి దిగడం వల్ల మీరు చేసే వ్యాయామనికి అదనపు ప్రయోజనం అందినట్లే. కాలి కండరాలు దృఢంగా మారతాయి. రక్తంలో ఆక్సిజన్‌ నిల్వలు క్రమంగా పెరుగుతాయి.
  • స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలని పదివారాల పాటూ క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒత్తిడిపై పోరాడే ఫీల్‌గుడ్‌ ఎండార్ఫిన్లు పుష్కలంగా విడుదలవుతాయట. కౌన్సెలింగ్‌, చికిత్సలకన్నా వ్యాయామం ఇచ్చే ప్రయోజనాలే అధికం అంటున్నాయి అధ్యయనాలు.

ABOUT THE AUTHOR

...view details