తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

జ్వరంగా ఉన్నప్పుడు రతిలో పాల్గొంటే నరాల బలహీనత వస్తుందా? - జ్వరంగా ఉన్నప్పుడు సెక్స్​

Sex During Fever: రతిలో పాల్గొనడంపై చాలా మందికి రకరకాల సందేహాలు ఉంటాయి. జ్వరంగా ఉన్నప్పుడు రతిలో పాల్గొనవచ్చా? దాని వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? అనే సందేహాలను వ్యక్తం చేస్తుంటారు కొందరు. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే?

sukhibava
sukhibava

By

Published : Apr 24, 2022, 6:45 AM IST

Updated : Apr 24, 2022, 4:56 PM IST

Sex During Fever: భాగస్వామితో శృంగారంలో పాల్గొనాలని అనుకునే వారికి పలు రకరాలు సందేహాలు వస్తుంటాయి. రతిలో పాల్గొనడానికి ఏమైనా సమయం ఉంటుందా? దాని వల్ల దుష్ప్రభావాలు ఉంటాయా? మొదలైనవి ఆరోగ్య నిపుణుల దగ్గర వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మందిలో కలిగే మరో సందేహం..' జ్వరం ఉన్నప్పుడు సెక్స్​ చేయవచ్చా? ఒకవేళ అప్పుడు రతిలో పాల్గొంటే నరాల బలహీనత కలుగుతుందా? అనే అనుమాననాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమన్నారో తెలుసుకుందాం.

"శృంగారంలో పాల్గొనడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు. ఈ విషయాన్ని ఇది వరకే స్పష్టం చేశాము. దానికి సమయం అని ఏమీ ఉండదు. జ్వరం వచ్చినప్పుడు కూడా భాగస్వామికి ఇష్టమైతే రతిలో పాల్గొనవచ్చు. ఆ సమయంలో సెక్స్ చేస్తే పక్షవాతం వస్తుందని, నరాల బలహీనత కలుగుతుందని.. సెక్స్​కు పనికి రాకుండా పోతారని కొంత మంది భావిస్తుంటారు. అందులో నిజం లేదు. అవన్నీ అపోహలే." అని చెప్పుకొచ్చారు ఆరోగ్య నిపుణులు.

ఇదీ చూడండి :ఈ వ్యాయామాలు చేస్తే... శృంగార సామర్థ్యం రెట్టింపు!

Last Updated : Apr 24, 2022, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details