రాత్రి పూట మంచి పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటి పనులు మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. నిద్ర కూడా హాయిగా పడుతుంది. దీన్ని పరిశోధనలు కూడా బలపరస్తున్నాయి. కోపంతో నిద్ర పోవటం ఏమాత్రం మంచిది కాదని తాజా అధ్యయనం పేర్కొంటోంది.
కోపంతో నిద్రపోవడం అంత మంచిది కాదు!
సాధారణంగా మనతో ఎవరైనా గొడవ పడినా.. అమ్మా, నాన్నా తిట్టినా.. వెంటనే అలిగి అలా కోపంతోనే నిద్రపోతాం. అయితే అలా నిద్రించడం అంత మంచిది కాదని చెబుతున్నారు పరిశోధకులు.
కోపంతో నిద్రపోవడం వల్ల అనవసర విషయాలను మరచిపోయే ప్రక్రియ దెబ్బతింటోందని చెబుతున్నారు పరిశోధకులు. సాధారణంగా మనం నిద్రపోయినప్పుడు రోజంతా సేకరించిన సమాచారాన్ని మెదడు విడదీసుకుంటుంది. అవసరమైన విషయాలను జ్ఞాపకాలుగా పదిలపరచుకుంటుంది. అనవసరమైన వాటిని వదిలించుకుంటుంది. అయితే కోపంతో నిద్రకు ఉపక్రమిస్తే.. మనం తిరిగి గుర్తుకు తెచ్చుకోవద్దని అనుకునే విషయాలు మరుగునపడే ప్రక్రియ తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అందువల్ల ఏవైనా విభేదాలు, అభిప్రాయభేదాలుంటే పడుకునే ముందే పరిష్కరించుకోవటం మంచిదని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:'వేసవిలో భారత్ కరోనాను జయించొచ్చు!'