Curd And Honey Mix Benefits in Telugu : పెరుగు, తేనె కలిపి తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి మంచి రుచితో పాటు శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. నిత్యం పెరుగు, తేనెను కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుష్కలంగా ప్రోబయోటిక్స్..
Probiotics in Yogurt and Honey Protein : మంచి బాక్టీరియా కారణంగానే పాల నుంచి పెరుగు తయారవుతుంది. దీన్నే మనం ప్రోబయోటిక్స్గా పిలుస్తాం. ఈ ప్రోబయోటిక్స్ మన శరీరాన్ని ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎప్పుడైతే తేనె, పెరుగు కలిపి తీసుకుంటామో.. ప్రోబయోటిక్స్ మన శరీరానికి ఇంకా ఎక్కువ స్థాయిలో అందుతాయి.
ఎక్కువ ప్రోటీన్లు..
Yogurt and Honey Protein in Telugu : పాల నాణ్యతను బట్టి 100 గ్రాముల పెరుగులో సాధారణంగా 4 నుంచి 14 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. అయితే మనం పెరుగులో తేనెను కలిపినప్పుడు.. వాటిలో ఈ ప్రోటీన్ శాతం మరింత పెరుగుతుంది. దాంతో పాటు పెరుగు నాణ్యంగానూ తయారవుతుంది.
ఎముకల పటుత్వం కోసం..
Curd and Honey Benfits for Bones in Telugu : తేనెలో మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేయడంలో సహాయపడతాయి. పెరుగులోనూ ఎక్కువ మోతాదులో కాల్షియం ఉంటుంది. కాబట్టి పెరుగు, తేనె కలిపి తీసుకోవడం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది.