తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు కరోనా టీకా తీసుకోవచ్చా..? - కిడ్నీ సంబంధిత సమస్యలు

కరోనా టీకాలు వేయించుకునే వారిలో ఇప్పటికీ అనుమానాలు ఇప్పటికీ రేకెత్తుతూనే ఉన్నాయి. కిడ్నీ జబ్బులున్నవారు, కిడ్నీ విఫలమైన వారు, పుట్టుకతో ఒక కిడ్నీ గలవారు, ఒక కిడ్నీని తీసేయాల్సి వచ్చిన వారు, కిడ్నీ దానం చేసినవారు, కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారు, డయాలసిస్‌ చేయించుకుంటున్న వారు కరోనా టీకా తీసుకోవచ్చా? తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

Can people with kidney problems get corona vaccine?
Can people with kidney problems get corona vaccine?

By

Published : May 25, 2021, 9:58 AM IST

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ తప్పకుండా తీసుకోవాలి. టీకా తీసుకోవాల్సిన అవసరమూ ఉంది. ఎలాంటి భయాలూ అక్కర్లేదు. కిడ్నీజబ్బులు గలవారికి, కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారికి, డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. కొవిడ్‌-19 బారినపడే ముప్పు పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్‌ తలెత్తితే అది జబ్బుగా, తీవ్రంగా మారే ప్రమాదమూ ఎక్కువే. అప్పుడు వీరికి చికిత్స చేయటమూ కష్టమే. కొవిడ్‌-19 తీవ్రమైనవారికి స్టిరాయిడ్లు వాడాల్సి వస్తోంది. వీటితో రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. దీంతో కిడ్నీలు మరింత దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల ముందే టీకా తీసుకోవటం మంచిది. ఇది ఇన్‌ఫెక్షన్‌ నివారణకే కాదు, జబ్బు తీవ్రంగా మారకుండానూ కాపాడుతుంది.

ఇక ఒక కిడ్నీ గలవారికి రెండు కిడ్నీలు ఉన్నవారిలో మాదిరిగా అదనపు రక్షణ ఉండదు. నిజానికి పుట్టుకతోనే ఒక కిడ్నీ గలవారిలో చాలామందికి ఆ విషయమే తెలియదు. ఇతరత్రా జబ్బుల పరీక్షల కోసం వెళ్తే బయటపడుతుంటుంది. ఇలాంటివాళ్లు ఆరోగ్యంగానే ఉండొచ్చు. పైకి ఎలాంటి ఇబ్బందులూ లేకపోవచ్చు. కానీ ఏదైనా సమస్య ముంచుకొచ్చినప్పుడు రెండో కిడ్నీతో లభించే రక్షణ కొరవడుతుంది. ఆయా సమస్యలను తట్టుకునే శక్తీ అంతగా ఉండకపోవచ్చు. అందువల్ల నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా టీకా తీసుకోవటమే ఉత్తమం.

ఇదీ చూడండి: కరోనా సోకిన గర్భిణుల ప్రసవాల్లో ఆ ఆస్పత్రులు ఆదర్శం

ABOUT THE AUTHOR

...view details