వివిధ కారణాల వల్ల కిడ్నీలో ఏర్పడే రాళ్లకు ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం (Kidney Stone Removal Food) ఉందంటున్నారు ఆరోగ్య నిపుణలు. మునగాకుతో తయారు చేసిన (Kidney Stone Removal Food) ఈ పథ్యాహారాన్ని తీసుకుంటే కొద్ది రోజుల్లోనే కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్ పెట్టొచ్చు అని చెబుతున్నారు.
కావాల్సిన పదార్థాలు - మునగాకులు, నెయ్యి, పెరుగుమీద ఉండే నీరు, ఉప్పు
తయారీ విధానం -
ముందుగా మునగానుకు (Kidney Stone Removal Food) శుభ్రంగా కడిగేసి దానిని ఒక ముద్దలాగా నూరుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో చెంచాడు నెయ్యి వేసి కరిగించాలి. ఇందులో ఇప్పుడు రెండు చెంచాల మునగాకు పేస్ట్‌ను వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఓ గ్లాసు నీళ్లు పోయాలి. కాసేపు మరిగించాక వడపోస్తే మునగాకు కషాయం సిద్ధం అవుతుంది. ఇది చల్లారాక ఇందులో పెరుగు మీద తేటను కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే ఔషధం రెడీ.
అరకప్పు మునగాకు కషాయం, అరకప్పు పెరుగు మీద తేటను కలుపుకుని.. ఈ ఔషధాన్ని కొద్ది రోజుల పాటు ఉదయం, సాయంత్రం తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది. ఈ కషాయాన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని గోరు వెచ్చగానే తీసుకోవాలి.
ఈ మునగాకు కీళ్లనొప్పులు ఉన్న వారికి కూడా ఉపయోగపడుతుంది. నొప్పులు తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఇదీ చూడండి :మునగాకు దోశలతో కీళ్ల నొప్పులకు చెక్!