Avoid These Foods in Breakfast: రోజూ మనం తీసుకునే ఆహారంలో బ్రేక్‌ఫాస్ట్ కీ రోల్ పోషిస్తుంది. రాత్రి మొత్తం పడుకుని ఉండటం వల్ల ఉదయానికి బాడీ డీహైడ్రేట్‌కు గురవుతుంది. దీంతో మార్నింగ్ ఎనర్జీ గెయిన్ చేయడానికి టిఫెన్ తినడం అనివార్యం. అయితే.. ప్రస్తుత రోజుల్లో స్కూల్‌కు టైమ్ అవుతోందని పిల్లలు.. ఆఫీసులకు టైమ్ అవుతోందని పెద్దలు.. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. మిగిలినవారంతా దాదాపుగా ఆరోగ్యాన్ని పాడుచేసే ఆహారాన్నే తింటూ ఉంటారు. తద్వారా అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే.. ఉదయం తినే ఆహారాల్లో.. కొన్ని అస్సలే తినకూడదని అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
అత్యంత శుద్ధి చేసిన తృణధాన్యాలు:చాలా తృణధాన్యాలు చక్కెరను కలిగి ఉంటాయి. కొన్ని తృణధాన్యాల్లో సహజంగా షుగర్ కంటెంట్ ఉన్నప్పటికీ.. మరికొన్నింటిలో ప్రాసెసింగ్ సమయంలో యాడ్ చేస్తారు. దీనివల్ల బరువు పెరుగుట, దంత క్షయం, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. అదే విధంగా, మొక్కజొన్న లేదా ఊక ఫ్లేక్స్ వంటి తియ్యని తృణధాన్యాల్లో కూడా ప్రొటీన్లు తక్కువగా ఉంటాయి. గ్రానోలా వంటి మరింత సహజంగా కనిపించే వాటిలో కూడా చక్కెర ఉంటుంది. దీంతో ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు తలెత్తుతాయి.
ఆకలి లేకున్నా భోజనం! - "చంద్రముఖి"లో రజనీకాంత్ డైలాగ్ గుర్తుందా?
పాన్ కేక్స్ లేదా వాఫ్ఫల్స్:పాన్‌కేక్స్, వాఫ్ఫల్స్ చాలా రుచికరంగా ఉంటాయి. అయితే, మార్నింగ్ టైమ్‌లో కావాల్సిన ఎనర్జీని ఇవి ఇవ్వలేవు. ఎందుకంటే వీటిని.. మైదాతో తయారు చేస్తారు. అంతే కాకుండా వాటిని చక్కెర, వెన్న, సిరప్‌లతో తయారు చేయడం వల్ల అధిక కేలరీలు, కొవ్వు కలిగి ఉంటుంది. అలాగే ప్రొటీన్, ఫైబర్ లోపిస్తుంది. వీటి వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది తప్పించి ఆరోగ్యానికి అంత మంచివి కావంటున్నారు నిపుణులు.
బటర్డ్ టోస్ట్:ఇది అత్యంత ప్రజాదరణ పొందిన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి. అయినప్పటికీ, ఇందులో ప్రొటీన్ లేకపోవడం వల్ల ఎక్కువ సేపు ఎనర్జిటిక్‌గా ఉండలేం. బటర్డ్ టోస్ట్‌లోని కేలరీలలో ఎక్కువ భాగం బ్రెడ్‌లోని పిండి పదార్థాలు, వెన్న నుంచి వచ్చే కొవ్వు నుంచే వస్తుంది. అయితే మీకు బటర్డ్ టోస్ట్ తినాలనిపిస్తే.. హోల్ గ్రెయిన్ బ్రెడ్‌ని ఎంచుకుని, గుడ్లు లేదా తురిమిన చికెన్ బ్రెస్ట్ వంటి ప్రోటీన్-రిచ్ టాపింగ్స్‌ని జోడిస్తే బ్రెడ్ అండ్ బటర్ అప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌కు సూపర్‌గా ఉంటుంది. పోషక పదార్ధాలను మరింత పెంచడానికి, టమాటలు, దోసకాయలు లేదా ఆకు కూరలు వంటి ముక్కలు చేసిన కూరగాయలను యాడ్ చేసుకోవచ్చు.
పోషకాల నిలయం- బూడిద గుమ్మడికాయతో ఎంతో ఆరోగ్యం- బరువు తగ్గొచ్చు కూడా!
పూరీ:చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఆయిల్‌ఫుడ్‌ను తీసుకుంటుంటారు. అందులో వడ, పూరీలను ఎక్కువగా తింటారు. ముఖ్యంగా పూరీలను డీప్ ఫ్రై చేయడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట వస్తుంది. ఇందులో ప్రొటీన్ తక్కువ ఉండి.. కేలరీలు అధికంగా ఉంటాయి.