తెలంగాణ

telangana

ప్రభుత్వ కార్యాలయంలో నిబంధనలు బేఖాతరు

By

Published : Jun 11, 2020, 5:28 PM IST

ప్రభుత్వ కార్యాలయాలలో లాక్​డౌన్ నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయానికి ఎంతో మంది ప్రజలు సేవలు వినియోగించుకునేందుకు వస్తుంటారు. సిబ్బందితో పాటు.. వివిధ పనుల కోసం వచ్చేవారు మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా నిబంధనలు విస్మరిస్తున్నారు.

Yadagirigutta Sub Registrar's Office.. Violation of Lockdown Terms
ప్రభుత్వ కార్యాలయంలో నిబంధనలు బేఖాతరు

యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయంలో.. లాక్​డౌన్ నిబంధనల ఉల్లంఘన యధేచ్ఛగా జరుగుతోంది. కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నియమాల అమలును అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ఈ కార్యాలయానికి తెలంగాణతోపాటు ఇతర ప్రాంతాల వారు కూడ సేవలు వినియోగించుకునేందుకు వస్తుంటారు.

కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్ధీగా కనిపిస్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద శానిటైజర్​ కనిపించడం లేదు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా నిబంధనలు విస్మరిస్తున్నారు. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం పట్ల విమర్శలు వస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో ఇప్పటికే కరోనా విజృంభిస్తోంది. అయినప్పటికీ జాగ్రత్తలు పాటించకపోవటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. కార్యాలయాల్లో పనిచేసేవారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొంది. వైద్యఆరోగ్యశాఖ సూచనల మేరకు కార్యాలయాల్లో చేయాల్సిన, చేయకూడని పనుల జాబితాను విడుదల చేసింది.

ప్రభుత్వ నిబంధనలు

  • రోజూ కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతను తప్పనిసరిగా తనిఖీ చేయాలి.
  • జ్వరం, దగ్గు, జలుబు వంటివి ఉంటే తగ్గే వరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమని చెప్పాలి.
  • శానిటైజర్లు అందరికి అందుబాటులో ఉంచాలి.
  • టేబుళ్లు, డోర్‌ హ్యాండిళ్లు, వాటర్‌ ట్యాప్‌లు లాంటివి రోజుకు 3 నుంచి నాలుగు సార్లు లైజాల్‌ లేదా సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి.

కొవిడ్‌ నిర్మూలన నోడల్‌ అధికారి

  1. మాస్క్‌ తప్పనిసరిగా ధరించి కార్యాలయానికి రావాలి.
  2. పేపర్లు, ఫైల్స్‌, నగదు వంటివి తాకిన ప్రతిసారి చేతులను శుభ్రం చేసుకోవాలి.
  3. తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు దస్తీ లేదా టిష్యూ, రుమాలను అడ్డు పెట్టుకోవాలి.
  4. పని చేసేచోట ఉద్యోగులు కనీసం 3 అడుగులు, వీలైతే 6 అడుగులు దూరంగా ఉండాలి.

ఇదీ చూడండి:జూడాల సమ్మె కొనసాగింపు.. సూపరింటెండెంట్​కు లేఖ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details