యాదాద్రిలో పొటెత్తిన భక్తజనం - యాదాద్రిలో పొటెత్తిన భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాది సందర్భంగా కుటుంబసమేతంగా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి... స్వామి దర్శనం చేసుకున్నారు.
యాదాద్రిలో పొటెత్తిన భక్తజనం
నూతన సంవత్సరం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే యాదాద్రికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్షేత్రంలో సందడి పెరిగింది. కుటుంబసమేతంగా పిల్లాపాపలతో కలిసి యాదాద్రిని దర్శించుకున్నారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. స్వామివారి ధర్మదర్శానానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండుగంటల సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఆలయ అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.
- ఈ కథనం చూడండి: ఈ కొత్త సంవత్సరం.. కొంగొత్త కానుకిద్దాం!
TAGGED:
యాదాద్రిలో పొటెత్తిన భక్తులు