తెలంగాణ

telangana

ETV Bharat / state

టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సు ఢీ... మూడు కార్లు ధ్వంసం - road accident at patangi toll plaza

ఆర్టీసీ బస్సు ఢీ కొని మూడు కార్లు ధ్వంసమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్​ ప్లాజా వద్ద జరిగింది. ప్రాణాపాయం లేనందున అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

road-accident-at-patangi-toll-plaza
టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సు ఢీ... మూడు కార్లు ధ్వంసం

By

Published : Jan 17, 2020, 3:22 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ముందున్న కార్లను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు... హైదరాబాద్​ నుంచి మణుగూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ముందువరుసలో ఉన్న కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఒకదానికొకటి ఢీకొట్టడంతో మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కానందున అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బ్రేక్ ఫెయిలవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ తెలిపాడు.

టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సు ఢీ... మూడు కార్లు ధ్వంసం

ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు

ABOUT THE AUTHOR

...view details