తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ సంబంధమే హత్యకు కారణం - latest crime news in telangana

ఆమెకు పెళ్లై పన్నెండేళ్లు అవుతోంది. ఇద్దరు పిల్లలూ ఉన్నారు. ఎందుకో ఏమో భర్తతో విడిపోయింది. 6 సంవత్సరాలుగా తాపీ మెస్త్రీతో వివాహేతర సంబంధం కొనసాగించింది. చివరికి అతడి చేతిలోనే హత్యకు గురైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో ఈ దారుణం జరిగింది.

rachakonda police find out accused in murder case in cjouttuppal
ఆ సంబంధమే హత్యకు కారణం

By

Published : Mar 11, 2020, 8:42 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావికి చెందిన జయసుధకు మల్కాపురానికి చెందిన మీసాల శేఖర్ తో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయారు. జయసుధ ఎల్లంబావిలో నివాసం ఉంటూ 6 సంవత్సరాలుగా ఉదరి రమేశ్​ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది.

ఆ సంబంధమే హత్యకు కారణం

రమేశ్​కు 2 సంవత్సరాల క్రితం వివాహం కాగా 3 నెలల నుంచి జయసుధ వద్దకు వెళ్లడం లేదు. జయసుధ తరుచుగా రమేశ్​కు ఫోన్​ చేస్తూ ఉండేది. ఓ రోజు జయసుధ నివసిస్తున్న ఇంటిపక్కన రమేశ్​ తాపీ మేస్త్రీ పనికి వెళ్లగా అక్కడ ఇద్దరికి గొడవ జరిగింది. మరుసటి రోజు ఎవరు లేని సమయంలో మద్యం సేవించిన రమేశ్..​ జయసుధ ఇంటికి వెళ్లి ఆమెను హత్య చేశాడు. అనంతరం పోలీసులకు చిక్కాడు.

ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస

ABOUT THE AUTHOR

...view details