యాదాద్రి(Yadadri) క్షేత్రాభివృద్ధిలో భాగంగా స్వామి వెలసిన కొండను ఆధ్యాత్మికంగా రూపొందిస్తున్నారు. అదే క్రమంలో కొండ కింద ఆలయ పరిసరాలనూ ఆధ్యాత్మికంగానే కాకుండా గ్రామీణ వాతావరణం ప్రస్ఫుటమయ్యేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గత మార్చిలో ఈ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాల మేరకు యాడా కొండకింద ఉత్తర దిశలో ప్రెసిడెన్షియల్ సూట్ల చెంత వలయ రహదారి కూడలిలో ఈత, కొబ్బరి, పొన్న, నాగావళి చెట్ల పోషణకు గురువారం శ్రీకారం చుట్టింది.
Yadadri: హరితమయం కానున్న యాదాద్రి పుణ్యక్షేత్రం - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
కలశ రూపంతో సహజ సిద్ధమైన కొండ ప్రాంగణాలు, మన సంస్కృతిని చాటే కలశ రూపం పచ్చదనంతో కూడిన పల్లెటూళ్ల వాతావరణం సాదృశ్యమయ్యేలా యాదాద్రి(Yadadri) పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. యాడా కొండకింద ఉత్తర దిశలో ప్రెసిడెన్షియల్ సూట్ల చెంత వలయ రహదారి కూడలిలో ఈత, కొబ్బరి, పొన్న, నాగావళి చెట్ల పోషణకు గురువారం శ్రీకారం చుట్టింది.
ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని కలిగించేందుకు మొక్కల పోషణకు ప్రణాళిక ఆధారంగా సన్నాహాలు చేపట్టారు. క్షేత్ర సందర్శనకై వచ్చే వీవీఐపీలు బస చేసే ప్రెసిడెన్షియల్ సూట్ల చెంత మొక్కలను కలశం ఆకారంలో నాటనున్నారు. గిరి ప్రదక్షిణ దారిలోనూ ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని అందించే తరహాలో వివిధ మొక్కల పెంపకం చేపట్టారు. ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో చేపట్టిన ఈ పనుల తీరుపై సీఎంవో భూపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: Vaccination: కొవిడ్ తగ్గిన వారికి ఒక్క డోసు చాలు..!