యాదాద్రి భువనగరి జిల్లాలో కొలువై ఉన్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి బాల ఆలయంలో ఏకాంత సేవలో స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అర్చించారు.
యాదాద్రీశుడికి లక్షపుష్పార్చన - యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి లక్షపుష్పార్చన
ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బాల ఆలయ మండపంలో స్వామిఅమ్మ వార్లకు లక్ష పుష్పార్చన నిర్వహించారు. కరోనా ప్రభావం వల్ల భక్తులు లేకుండా అర్చకులు పూజా క్రతువును గావించారు.
![యాదాద్రీశుడికి లక్షపుష్పార్చన one lakh puspa archana in yadadri laxminarasima swamy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6658167-thumbnail-3x2-yadadri-rk.jpg)
యాదాద్రీశుడికి లక్షపుష్పార్చన
ప్రతి మాసంలోని శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి పర్వదినాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజా క్రతువు నిర్వహించడం ఆనవాయితీ. కరోనా ప్రభావం వల్ల భక్తులను అనుమతించలేదు. అర్చకుల సమక్షంలో పూజలు చేశారు.
యాదాద్రీశుడికి లక్షపుష్పార్చన
ఇవీ చూడండి: ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌తో ఇంటివద్దే కరోనా పరీక్షలు