నూతన సంవత్సరం సందర్భంగా బేకరీ షాపుల్లో రంగు రంగుల కేకులు వివిధ సైజుల్లో కొలువు దీరాయి. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఓ బేకరీ దుకాణంలో బీర్ కేకు దర్శనమిచ్చింది. కేకులో బీరు సీసాను పొందుపరిచి అమ్మారు.
బీర్ కేక్ ఎప్పుడైనా తిన్నారా? - యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఓ బేకరీ దుకాణంలో బీర్ కేకు
బీర్ కేక్ ఎప్పుడైనా తిన్నారా.. బీరుతో కేక్ ఎంటనీ అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది నిజమే. ఓ వినియోగదారుని కోరిక మేరకు భువనగిరి పట్టణంలోని ఓ బేకరీ దుకాణంలో బీర్ కేక్ దర్శనమిచ్చింది.
బీర్ కేక్ ఎప్పుడైనా తిన్నారా?
పలువురు వినియోగదారులు ఆ కేకును ఆసక్తిగా తిలకించారు. కొందరు ఆ దృశ్యాన్ని చూసి ఇదేమి చోద్యం అంటూ నవ్వుకున్నారు. కేకు గురించి బేకరి యజమానిని అడుగగా ఓ వినియోగదారుని కోరిక మేరకు అలా తయారుచేసామని వెల్లడించారు.
ఇదీ చూడండి : ఇవాళ్టి నుంచి భాగ్యనగరంలో నుమాయిష్ జోష్