తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడం వల్ల పిల్లలతో సహా భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. దర్శన క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనం కోసం గంటలతరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోంది. నరసింహుని ధర్మదర్శనానికి 2 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పడుతోంది.
భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రం - భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రం
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నరసింహుని ధర్మదర్శనానికి 2 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పడుతోంది.
భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రం