తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు కన్నీళ్లు మిగిల్చిన వడగండ్ల వాన

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో వడగండ్ల వర్షం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 రోజులుగా కురిసిన అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోయారు.

By

Published : Apr 10, 2020, 11:22 AM IST

Rain Effect
Rain Effect

ఇటీవల కురిసిన వడగండ్ల వానల వల్ల యాదాద్రి భువనగిరిజిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికందే సమయంలో వాన కురవడం వల్ల పంట నేలరాలింది. జిల్లాలోని తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులకు చెట్లు, కరెంట్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. కొందరి ఇళ్లు, కోళ్ల ఫారం షెడ్లు పూర్తిగా కూలిపోయాయి.

కొంతమంది రైతులు కోసినవరి పంట పన్నలను ఆరబెట్టినా ఫలితం లేకుండాపోయింది. పంట కొట్టుకోపోవడం వల్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈసారి ఎక్కువ పంట పండిందని సంతోషపడుతున్న సమయంలో.. వడగండ్ల వర్షంతో తమ ఆశలు... నిరాశలయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

రైతులకు కన్నీళ్లు మిగిల్చిన వడగండ్ల వాన

ఇదీ చూడండి:తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details