యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలిక ఎన్నికల ఏర్పాట్లను, పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పరిశీలించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు.
16 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని... వాటిని వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల రోజు పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని.. చరవాణీలు వెంట తెచ్చుకోవద్దని సూచించారు.