తెలంగాణ

telangana

By

Published : Sep 10, 2020, 10:25 PM IST

ETV Bharat / state

'రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయపరమైన పరిహారమిస్తాం'

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న రోడ్డు విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులతో కలెక్టర్​ అనితా రామచంద్రన్​ సమావేశం ఏర్పాటు చేశారు. రోడ్డు బాధితుల విన్నపాలపై అధికారులు, సీఎం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయపరమైన పరిహారం చెల్లిస్తామని కలెక్టర్​ హామీ ఇచ్చారు.

yadadri collector meeting on road expansion
'రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయపరమైన పరిహారమిస్తాం'

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండ కింద రోడ్డు విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులతో కొండపైనున్న హరిత టూరిజంలో జిల్లా కలెక్టర్​ అనితా రామచంద్రన్ సమావేశం నిర్వహించారు. ఆలయ వైకుంఠ ద్వారం మెట్ల కమాన్​ నుంచి కొండపైకి వెళ్లే మొదటి ఘాట్​రోడ్డు వరకు రోడ్డు విస్తరణకు అధికారులు ప్రణాళికలు చేపట్టినట్లు కలెక్టర్​ తెలిపారు.

బాధితులకు న్యాయపరమైన పరిహారం చెల్లిస్తామని.. రింగురోడ్డులో ఇళ్ల స్థలాలు, ఇళ్లు కోల్పోయిన వారికి సరైన విధంగా చెల్లిస్తామన్నారు. రోడ్డు విస్తరణలో చేపట్టే రహదారి కొలతల విషయాలు, రోడ్డు మధ్యలో రాబోయే డివైడర్, గ్రీనరీ పలు అంశాలపై చర్చించారు. రోడ్డు బాధితుల విన్నపాలపై అధికారులు, సీఎం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేస్తామని అనితా రామచంద్రన్​​ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండిఃకొండగట్టు ఆలయం మూడురోజులు మూసివేత: ఈవో

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details