యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బుద్ధ మురళి దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. స్వామివారి సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు.
యాదాద్రీశుడి సేవలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ - telangana news
రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బుద్ధ మురళి.. యాదాద్రీశుడిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
యాదాద్రీశుడి సేవలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్
బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు లడ్డూ ప్రసాదం అందచేసి.. ఆశీర్వదించారు. శ్రీ మహావిష్ణు అలంకార గరుడవాహన సేవలో పాల్గొన్నారు. వారి వెంట ఆలయ అధికారులు ఉన్నారు.