తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు దుర్మరణం.. - warangal urban

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట్ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన టాటా ఏస్​ వాహనం ఢీకొని వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అదే రహదారిపై రెండు రోజుల్లోనే ఇద్దరు మహిళలు  మృతిచెందారు.

రహదారి ప్రమాదం

By

Published : Feb 14, 2019, 10:59 AM IST

రహదారి ప్రమాదం
వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట్​ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణానికి చెందిన వృద్ధురాలు భారతి రహదారి దాటుతుండగా టాటా ఏస్​ వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి టాటా ఏస్​ వాహనం అతివేగమే కారణమని తేల్చారు. రెండు రోజుల వ్యవధిలోనే అదే రహదారిపై ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డారు. రద్దీ ప్రాంతాల్లో వాహనదారులు అధిక వేగంతో వెళ్తున్నారని..అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


ABOUT THE AUTHOR

...view details