తెలంగాణ

telangana

ETV Bharat / state

'మాస్కుతో వస్తేనే లోపలికి అనుమతిస్తాం'

కరోనా వైరస్ ప్రబలకుండా వరంగల్ మహా నగర పాలక సంస్థ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కరోనా పై అవగాహన కలిపిస్తూ... తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.

By

Published : Mar 21, 2020, 1:38 PM IST

warangal municipal corporation take precautions for corona virus
మాస్కుతో వస్తేనే లోపలికి అనుమతిస్తాం

కొవిడ్​-19 వ్యాప్తిని నియంత్రించడానికి వరంగల్​ మహా నగర పాలక సంస్థ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులు, ఇతరలు కార్యాలయం లోపలికి ప్రవేశించాలంటే ముందుగా చేతులను శుభ్రం చేసుకోవాలనే నిబంధన పెట్టారు. ఉద్యోగులు మాస్కులు ధరించాలని కమిషనర్ ఆదేశించారు.

కార్యాలయానికి వచ్చే వారి కోసం కార్యాలయం ఎదుట నీటి తొట్టిని ఏర్పాటు చేశారు. వారు చేతులను శుభ్రం చేసుకుని, మాస్కులు ధరింస్తేనే ఆఫీస్​ లోనికి అనుమతిస్తున్నారు. మాస్కులు ధరించని వారిని కార్యాలయం లోపలకి అనుమతించక పోయిన కారణంగా అధికారులతో కొందరు గొడవకు దిగారు.

మాస్కుతో వస్తేనే లోపలికి అనుమతిస్తాం

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్​: ఎటు చూసినా భయం- అంతా నిర్మానుష్యం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details