లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వేద పండితులను వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాష్ ఆదుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆలయాలు మూతపడడం, శుభకార్యాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేద అర్చకులకు మేయర్ గుండా ప్రకాష్ నిత్యావసర సరకులతో పాటు బియ్యం, కూరగాయలను పంపిణీ చేశారు.
అర్చకులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మేయర్ - lockdown
వరంగల్ నగరంలోని మట్టెవాడ భోగేశ్వర స్వామి ఆలయంలో 200 మంది నిరుపేద అర్చకులకు మేయర్ గుండా ప్రకాష్ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. అర్చకులకు బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
నిరుపేద అర్చకులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మేయర్
మట్టెవాడలోని భోగేశ్వర స్వామి ఆలయంలో నగరంలోని సుమారు 200 మంది నిరుపేద అర్చకులకు సరకులు అందజేశారు. అర్చకులకు బాసటగా నిలుస్తామని.. అధైర్య పడకుండా ఉండాలని మేయర్ వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి: రాష్ట్రాల్లోని పరిస్థితులను గమనించాలి : కేటీఆర్